క్రీడా పోటీలలో గెలుపోటములు ముఖ్యము కాదని నైపుణ్యాన్ని ప్రదర్శించడమే ముఖ్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరని అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం ఈద్గాల్ మైదానంలో మంగళవారం నారాయణ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలో భాగంగా మూడవరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరణి హాజరయ్యారు.