సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరబిందో కంపెనీకి ఫోన్ చేసి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని అడిగాడని వాళ్లు ఇవ్వకపోవడంతో ఆ కంపెనీపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. బుధవారం నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దీనిపై సోమిరెడ్డి కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధం కావాలని సవాల్ చేశారు.