బీసీల సంక్షేమం కోసం కృషి చేసేది టిడిపి_ కోటంరెడ్డి

58చూసినవారు
బీసీల సంక్షేమం కోసం కృషి చేసేది టిడిపి_ కోటంరెడ్డి
బీసీల సంక్షేమం కోసం కృషి చేసేది తెలుగుదేశం పార్టీయేనని టిడిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.శనివారం నెల్లూరు రూరల్ టిడిపి కార్యాలయంలో జరిగిన బీసీలు,సంచార జాతి కులస్తుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 50 సంవత్సరాలు నిండిన బీసీలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తారని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్