సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య, ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని విద్యుత్ భవన్ వద్ద రూరల్ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని కోరారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై 8114 కోట్ల రూపాయల భారం వేయడం దుర్మార్గమని తెలిపారు.