ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నగరపాలక సంస్థ వార్డు సచివాలయాలు, పౌర సేవలు, ఇసుక బుకింగ్ వంటి సేవలను పొందేందుకు ఇంటింటి సర్వే తప్పనిసరి అని కమిషనర్ సూర్య తేజ మంగళవారం పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలంతా హౌస్ హోల్డ్ సర్వేలో తమ ఇంటిని మ్యాపింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. సచివాలయ కార్యదర్శులు ఈ సర్వేలో సహకరించాలని కమిషనర్ కోరారు.