నెల్లూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం. విద్యా రమను, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లక్కాకుల పెంచలయ్య, దేవ ప్రసన్న కుమార్ తదితరులు నెల్లూరు జడ్పీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఉద్యోగుల పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సురేష్ బాబు, అనిల్, రమేష్ బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.