పొలాలను తక్కువ రేటుకు ఇప్పిస్తామని చెప్పి అడ్వాన్సుగా 50 లక్షల రూపాయలు తీసుకోరావాలని చెప్పి మార్గ మధ్యలో ముత్తుకూరు సమీపంలో నకిలీ పోలీసుల పేరుతో వారి వద్ద నుంచి నగదు దూసుకెళ్లినట్లు నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రాత్రి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగతనంకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.