నెల్లూరు రూరల్ పరిధి పొట్టే పాలెం గ్రామంలో శనివారం పల్లె పండుగ కార్యక్రమంలో రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ షెల్టర్ల పనులకు శంకుస్థాపన చేశారు. రూరల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో 18 గ్రామాల్లో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు