ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ముత్తుకూరు మండలం పిడతా పోలూరు గ్రామంలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనీ మొక్కలు నాటారు.