తుఫాన్ కారణంగా ప్రజలందరూ ఇంటి వద్ద నుంచి బయటకు రావద్దని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రమాదకర భవనాలు, చెట్లు, ఒరిగిన విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని తెలిపారు. టిడిపి శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారికి సూచించారు. ముఖ్యంగా ఫోన్లో చార్జింగ్, త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలి అన్నారు.