ఉదయగిరి ఎక్సైజ్ కార్యాలయాన్ని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ జగదీశ్వర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్సైజ్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. నూతన మద్యం పాలసీ, టెండర్ల నిర్వహణ పై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ లక్ష్మణస్వామి, ఎస్ఐ పూర్ణ కుమార్, ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.