దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లులో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బిజెపి నాయకులు మహేంద్రబాబు మోడీ చేపట్టారు. కార్యక్రమంలో అయన మాట్లాడుతూ ఏరుకొల్లులో ప్రతీ ఇంటా బిజెపి సభ్యులు ఉండాలన్నదే ధ్యేయమన్నారు. గ్రామ ప్రజలు బిజెపి సభ్యత్వానికి చూపుతున్న ఆసక్తి చూస్తుంటే రానున్న ఎన్నికల్లో మరోమారు అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.