నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో శుక్రవారం సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం పడింది. ఇటీవల కాలంలో తీవ్ర ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. కాగా గండిపాలెంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో చినుకు అంత వర్షం కూడా లేకపోవడం గమనార్హం.