ఉదయగిరిలో హద్దు మీరిన మందుబాబులు

69చూసినవారు
ఉదయగిరిలో హద్దు మీరిన మందుబాబులు
ఉదయగిరి పట్టణంలోని ఆనకట్ట పై కుప్పలు కుప్పలుగా మద్యం సీసాలు కనిపించడం విమర్శలకు దారితీస్తుంది. రాత్రి వేళల్లో పూటుగా మద్యం తాగి సీసాలు అక్కడే పడేస్తున్నారు. కొందరు అతిగా ప్రవర్తించి సీసాలను ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. దీంతో అటుగా జాగింగ్ చేసే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఉదయగిరి ఆనకట్టను ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్