జలదంకిలో భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు

63చూసినవారు
నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని హై స్కూల్ ప్రాంగణంలో సోమవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చుట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో మహిళలలు తరలివచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. రకరకాల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ముగ్గులను చూడడానికి భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చారు. విజేతలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్