ఉదయగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రులోని అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం సరిగా అందుతుందా లేదా అని తెలుసుకున్నారు. వైద్యశాల లోని సమస్యలపై డాక్టర్ తో మాట్లాడారు. అదేవిధంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ రోగుల పట్ల స్నేహభావం తో మెలుగుతూ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.