నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా ప్రతి ఒక్కరు ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదేశాల వరకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసిపి నాయకులు పాప పరిహారగా ప్రత్యేక పూజలు చేశారు.