ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా పల్లె పండగ

79చూసినవారు
కలిగిరి మండలంలో సోమవారం జరిగిన "పల్లెపండగ కార్యక్రమం"లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. రూ. 14. 40 లక్షల ఉపాధి హామీ నిధులతో సిద్ధనకొండూరు గ్రామంలో, రూ. 10 లక్షల ఉపాధి హామీ నిధులతో పోలంపాడు లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 4 నెలల వ్యవధిలో గ్రామాల్లో నాలుగున్నర వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్