సీతారాంపురం మండలం లోని బాలాయపల్లి పంచాయతీ లో గల పోకలవారిపల్లి కాలనీలో గత నెల రోజుల నుంచి వీధి లైట్లు వెలగడం లేదు. దీనిపై ఆ గ్రామస్తులు పలుమార్లు అధికారులకు, నాయకులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునే వారే లేరని ఆవేదన చెందుతున్నారు. అసలే వర్షాలు కురుస్తుండడంతో అక్కడి ప్రజల ఇబ్బంది మరి దారుణంగా తయారయింది. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ఇల్ల నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు.