ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు వరికుంటపాడు, మర్రిపాడు, జలదంకి పోలీస్ స్టేషన్లను ఎస్పీ కృష్ణ కాంత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలోని రికార్డులు పరిశీలించారు. క్రైమ్, దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మాధక ద్రవ్యాలపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనతో డిఎస్పి శ్రీనివాసులు ఉన్నారు.