ఉదయగిరి అటవీ శాఖ రేంజ్ అధికారిగా బెజ్జిపురం సుగుణ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే దుత్తలూరు డిఆర్ఓ గా కే. మురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రేంజ్ పరిధిలో ఎవరైనా అక్రమంగా అటవి సంపదను తరలిస్తే చాలా తీవ్రతరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ అటవీ శాఖ అధికారులకు సహకరించాలన్నారు.