దుత్తలూరు మండలంలో ఉదయగిరి ఎక్సైజ్ నెల్లూరు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి 25 మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నట్లు ఉదయగిరి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ లక్ష్మణస్వామి తెలిపారు. బత్తుల నరసింహులు, దాసు శ్రీనివాసులు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.