ఉదయగిరి పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని ఉపాధి హామీ సిబ్బందితో నెల్లూరు జిల్లా పిడి గంగాభవాని మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హత కలిగి ఉన్న వారికి జాబ్ కార్డు మంజూరయ్యే విధంగా చూడాలని తెలిపారు. సిబ్బందికి అప్పగించిన పనుల పురోగతిపై మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు.