ఉదయగిరి, సీతారాంపురం మండలాల పరిధిలో ఉదయం నుంచి విపరీతంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతానికి అటు కావలి ఇటు నెల్లూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు మండలాల్లో విపరీతమైన ఈదురు గాలులు రావడం భారీ తుఫాన్ ప్రభావానికి ముందస్తు హెచ్చరికలా అనిపిస్తుందని దీంతో ప్రజలు భయపడుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లుల కురుస్తున్నాయి.