ఉదయగిరి మండలం లోని గండిపాలెం ఎస్సీ కాలనీలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య ఉంది. ఈ విషయాన్ని కాలనీవాసులు ఉదయగిరి ఎంపీడీవో అప్పాజీ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ఎంపీడీవో అప్పాజీ అధికారులతో కలిసి ఆ కాలనీలో పర్యటించారు. అలాగే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.