వరికుంటపాడు మండలం విరువూరు ఆర్బికేలో తుఫాన్ కారణంగా నష్టపోయిన శనగ రైతులకు సబ్సిడీ విత్తనాలను స్థానిక టిడిపి నాయకులు శుక్రవారం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మండల టిడిపి అధ్యక్షుడు చంద్ర మధుసూదన్ రావు, టిడిపి నాయకులు సబ్సిడీలో శనగ విత్తనాలు అందజేశారు. వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎల్లప్పుడూ ముందుంటారు అన్నారు.