నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం సమీపంలోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఇటీవల నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు స్వీకరించారు. అలాగే రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి గండిపాలెం జలాశయంలోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది.