Nov 05, 2024, 12:11 IST/
TG: బిర్యానీ తిని యువతి మృతి
Nov 05, 2024, 12:11 IST
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్ కావడంతో యువతి మరణించింది. ఈ నెల 2న బోథ్ కు చెందిన 15-20 మంది నిర్మల్ లోని గ్రిల్ నైన్ రెస్టారెంట్ లో చికెన్ మండీ బిర్యానీ తిన్నారు. ఆ వెంటనే ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకుంది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం పూల్ కలి బైగా(19) చనిపోయారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.