Sep 20, 2024, 02:09 IST/
రైతు భరోసా, వరద సాయంపై నేడు కీలక నిర్ణయం..!
Sep 20, 2024, 02:09 IST
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాల ఆమోదానికి సిద్దమైంది. తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి పెండింగ్ లో ఉన్న పలు ప్రధాన అంశాలకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అదే విధంగా రైతు భరోసాతో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట పరిహారం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హైడ్రా బలోపేతం పైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 200 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.