అంగన్వాడీ కేంద్రాలను ఆరోగ్య నిలయాలుగా తీర్చిదిద్దండి
అంగన్వాడీ కేంద్రాలను ఆరోగ్య నిలయాలుగా తీర్చి దిద్దేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలసి కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఏపి ఎస్సీపిసీఆర్) సభ్యులు గొండు సీతారాం అన్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలోని మెయిన్ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం అధికారులతో కలసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు,