శవమై తేలిన యువకుడు

51చూసినవారు
శవమై తేలిన యువకుడు
రాపూరు- చిట్వేలి ఘాట్ రోడ్ లోని శిద్ధిలేశ్వర కోనలోని నీటి గుండంలో గల్లంతైన యువకుడు సోమవారం శవమై తేలాడు. నెల్లూరులోని 3వ మైలుకు చెందిన మహేంద్ర (18) ఆదివారం ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి సిద్దిలేశ్వర కోనకు వచ్చి నీటి గుండంలోకి దిగిన మహేంద్ర మాత్రం ఎంతకూ తిరిగిరాలేదు. ఈ సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి గాలించారు. ఫలితం లేకపోవడంతో సోమవారం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత పోస్ట్