ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్న ఏపీ సీఎంఓ పేరుతో వచ్చిన ట్విట్‌లో ఉదయం 9.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అదంతా అవాస్తవమని తాజాగా సీఎంఓ వెల్లడించింది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకే ప్రమాణ స్వీకారం జరుగుతుందని పేర్కొంది.