AP: ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు, తెలుగు వారు ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తమ డబ్బు ఖర్చు పెట్టి మరి తమను ప్రవాసులు గెలిపించారని చెప్పుకొచ్చారు. కొంత మందిని చనిపోయిన తర్వత గుర్తు పెట్టుకుంటారు.. కానీ నన్ను బతికుండగానే గుర్తు పెట్టుకున్నారని అన్నారు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ తెలుగు జాతిలో పుట్టాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలియజేశారు.