కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులకు సీఎం ఆదేశించారు. సకాలంలో స్పందించి అధికారులను అప్రమత్తంగా చేశామని, హాస్టల్ మొత్తం తనిఖీ చేసినా ఎలాంటి పరికరాలు దొరకలేదని సీఎం చెప్పారు.