దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఏర్పాటుచేసిన గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 2024, డిసెంబరు 30న ప్రారంభించారు. కన్యాకుమారిలో బంగాళాఖాతంపై ఉన్న వివేకానంద స్మారక మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా 77 మీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పుతో రూ.37 కోట్ల వ్యయంతో గాజు వంతెన నిర్మించారు. 2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించారు.