ఎన్టీఆర్ ఒక ప్రభంజనం: బాలకృష్ణ (వీడియో)

64చూసినవారు
AP: ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రభుత్వాలు పేర్లు మార్చి అమలు చేస్తున్నాయన్నారు. టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారన్నారు.

సంబంధిత పోస్ట్