వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ

83చూసినవారు
వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కేంద్రంలో వరద బీభత్సానికి నిరాశ్రయులై వికాస్ కాలేజీలో ఆశ్రయం పొందుతున్న వారికి ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వారి ద్వారా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్సిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వలన సంభవించే విపత్తులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి తమ వంతుగా తగిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్