నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో మాజీ శాసనసభ్యులు నూజివీడు శాసనసభ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ చిన్నం రామకోటయ్య. ఆదివారం ప్రజాసభ పేరుతో ఏర్పాటు చేసిన రాజకీయ సభకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి జనం భారీగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది రామకోటయ్య మద్దతు దారులు హాజరై తమ సంఘీభావం తెలియజేశారు. దీనితో రామకోటయ్య గెలుపు సునాయాసంగా వుంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.