ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జూపూడి వద్ద ఇటీవల కృష్ణా నది వరదనీటిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్మెన్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. లైన్ మెన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రూ. 32. 25 లక్షల ఎక్స్ గ్రేషియో ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం రాత్రి చెక్కును, ఉత్తర్వులను బాధిత కుటుంబానికి అందజేశారు.