అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 9న ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రం ప్రధాన సెంటర్ వద్ద మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు, ఎన్జీవోస్ అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి ప్రసాదరావు ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం ఏర్పాటుచేసిన చలివేంద్రం శిబిరాన్ని ప్రముఖ స్వచ్ఛంద సేవకులు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బి. దాసు చేతుల మీదగా శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.