పాణ్యం: అధిక రేట్లకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
ఓర్వకల్లు ఎయిర్ పోర్టు దగ్గరలోని హెచ్8 హోటల్ యాజమాన్యం కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలులో వారు మాట్లాడారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించడమే అన్నారు. వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.