సంక్రాంతికి కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు

67చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ డివిజన్ ఏడు పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని డిసిపి రామకృష్ణ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పమన్నారు. ఇప్పటికే కొంతమందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్