ఎమ్మెల్యే వసంత అనుచరగణంపై వేటు

274698చూసినవారు
ఎమ్మెల్యే వసంత అనుచరగణంపై వేటు
మైలవరంలో రాజకీయ కాక రాజుకుంది. మైలవరం కొత్త ఇంఛార్జ్ గా తిరుపతిరావు యాదవ్ ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణా ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యే వసంతపై యాక్షన్ షురూ చేసింది. వసంత అనుచరగణంపై ప్రభుత్వం వేటు వేసింది. మైలవరం పరిధిలో 28 మంది కోఆపరేటివ్ సొసైటీల ఛైర్మన్లు, సభ్యులను తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్