19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ మూవీ

595చూసినవారు
19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ మూవీ
దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన 'బ్లాక్‌' సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బిగ్ బీ అమితాబ్, రాణీ ముఖర్జీ జంటగా నటించిన ఈ మూవీ 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమంది మనసులను కదిలించింది. ఈ సినిమా మూడు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపై తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్