వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 77 వేల విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించామన్నారు. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు త్వరలో ‘ఆపరేషన్ బుడమేరు’ చేపడతామని అన్నారు.