ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు, కాపాడేందుకు కదిలొచ్చిన వానర సైన్యం

66చూసినవారు
ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు, కాపాడేందుకు కదిలొచ్చిన వానర సైన్యం
కరీంనగర్ జిల్లా రామడుగులో ఓ కోతుల గుంపు నానా హంగామా చేసింది. ఈనెల 8న ఓ ఇంట్లోకి చొరబడిన రెండు కోతులు తలుపు గడియ పెట్టుకున్నాయి. కానీ, తిరిగి గడియ తీసుకునేందుకు వాటికి సాధ్యం కాలేదు. అయితే తమ నేస్తాలు ఆపదలో ఉన్నాయని భావించి తోటి వానరాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. స్థానికుల సాయంతో ఇంటి యజమాని గడియ తీసేందుకు యత్నించినా కుదరలేదు. దీంతో కిటికీలోని కొంత భాగాన్ని కట్ చేశారు. దీంతో అరగంట తర్వాత ఆ కోతులు ఇంటి నుంచి బయటకు వచ్చాయి.

సంబంధిత పోస్ట్