ఉత్తరాంధ్రలో పొంగిపొర్లుతున్న వాగులు.. వాహనాల రాకపోకలపై నిషేధం (వీడియో)

63చూసినవారు
ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై వరద పొంగి పొర్లుతుండగా, పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ముందు జాగ్రత్తగా నర్సీపట్నం, సీలేరు, వడ్డాది, పాడేరు, అరకు, అనంతగిరి, రంపచోడవరం, మారేడుమిల్లి ఘాట్ రోడ్లలో వాహనాలను నిషేధించారు.

సంబంధిత పోస్ట్