పల్నాడు: జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
అసెంబ్లీకి రాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రవర్తనపై మరోసారి ఆలోచించాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన చిలకలూరిపేట తమ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా లేకపోతే సభకు రానని అనడం సరికాదని, జగన్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల మాకేమీ నష్టం లేదని, పులివెందుల నియోజకవర్గ ప్రజలకే నష్టం అని అన్నారు. పులివెందుల ప్రజలకు జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.