వాగులో వ్యక్తి గల్లంతైన ఘటన మంగళవారం పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామ సమీపంలోని పిల్లేరు వాగులో చోటుచేసుకుంది. పొలాలకు నీరు పెట్టేందుకు పిల్లేరు వాగుకు విద్యుత్తు మోటార్లు రైతులు ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల నుంచి వాగుకు భారీ ఎత్తున వరద రావడంతో మోటారు బయటకు తీయడానికి శ్రీనివాసరావు వాగులోకి దిగాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. శ్రీనివాసరావు కోసం గజ ఈతగాళ్లతో వెతకగా. ఆచూకీ లభ్యం కాలేదు.