శ్రీశైలం నుంచి మాచర్ల మండలం నాగార్జున సాగర్ జలాశయానికి శనివారం 48, 710 క్యూసెక్కుల నీరు వచ్చింది. సాగర్ కుడి కాలువకు 9076, ఎడమ కాలువకు 8967, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28, 867, ఎస్. ఎల్బీసీ ప్రాజెక్టుకు 1800, లెవల్ కెనాలల్కు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ నీటి మట్టం 589.80 అడుగులకు చేరింది.